వాషింగ్టన్ : ఇరాన్ డ్రోన్లతో రష్యా తమపై దాడి చేస్తోందని ఉక్రెయిన్
చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా అమెరికా ప్రకటన చేసింది. రష్యా-ఇరాన్ మధ్య
ద్వైపాక్షిక సంబంధాలు పూర్తి స్థాయి రక్షణ భాగస్వామ్యంగా మారాయని అమెరికా
వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాకు ఇరాన్ పూర్తి మద్దతు
ఇస్తోందని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. పెను
విధ్వంసాన్ని సృష్టించే డ్రోన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను
ఇరు దేశాలు పరిశీలిస్తున్నట్లు అమెరికా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
డ్రోన్ల తయారీలో ఇరాన్-రష్యా మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ సమాజానికి
హానికరమని కిర్బీ తెలిపారు. ఆయుధాల అభివృద్ధి, సైనిక శిక్షణ రంగాల్లో ఇరాన్‌తో
కలిసి రష్యా పని చేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌కు అధునాతన ఆయుధాలు అందించాలని
రష్యా కూడా భావిస్తోందని అమెరికా తెలిపింది. రష్యా అతిపెద్ద సైనిక
మద్దతుదారుగా ఇరాన్ మారిందని కిర్బీ విమర్శించారు. ఉక్రెయిన్‌లో మౌలిక
సదుపాయాలపై దాడి చేయడానికి రష్యా.. ఇరాన్ డ్రోన్లను ఉపయోగించిందని
అమెరికాతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా వెల్లడించాయి. ఇరాన్-రష్యా
సంబంధాలు ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని బ్రిటన్ విదేశాంగ మంత్రి
జేమ్స్ ఆరోపించారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాల వల్ల ఇరాన్ వేలాది
డ్రోన్లను రష్యాకు పంపిందని ఆయన విమర్శించారు. దీనికి బదులుగా రష్యా ఇరాన్‌కు
సాంకేతిక సహాయాన్ని అందిస్తోందని వెల్లడించారు. రాబోయే నెలల్లో రష్యా
సైన్యానికి.. ఇరాన్ మద్దతు పెరుగుతుందని బ్రిటన్ అంచనా వేసింది. రష్యాకు
డ్రోన్ల సరఫరా ప్రపంచ భద్రతను అస్థిరపరుస్తుందన్న ఆస్ట్రేలియా దాని
పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.