శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద
ముఠా కమాండర్ ఆశిఖ్ నెంగ్రూకు చెందిన రెండంతస్తుల భవనాన్ని అధికారులు
కూల్చివేశారు. రాజ్‌పోరా ప్రాంతంలోని న్యూ కాలనీలోని ఈ ఇల్లు ప్రభుత్వ భూమిలో
ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కారణంగా పోలీసు రక్షణ మధ్య జిల్లా అధికారులు
పొక్లెయినుతో ఇంటిని పడగొట్టారు. 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన
పెట్టుకున్న 2019 నాటి పుల్వామా దాడిలో నిందితుడైన నెంగ్రూ ‘వాంటెడ్’
జాబితాలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో ఇతణ్ని చట్టవ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడుతున్న ‘ప్రత్యేక ఉగ్రవాది’గా ప్రకటించింది. నెంగ్రూ ఇంటి
కూల్చివేతను మరో ఉగ్రవాద మూక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్)
వ్యతిరేకించింది. దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులను,
అధికారులను హెచ్చరించింది.