వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు మేలు చేకూర్చే
ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్
ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్(ఈగిల్) యాక్ట్–2022ను అమెరికా అధ్యక్ష భవనం ఓకే
చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే అక్కడి పార్లమెంట్ దిగువ సభలో ఓటింగ్
చేపట్టనున్నారు. ఇన్నాళ్లూ ప్రతి సంవత్సరంలో జారీచేసే గ్రీన్‌కార్డుల్లో ఒక్కో
దేశానికి సంబంధించిన నిర్దిష్ట సంఖ్యలోనే కార్డులు ఇస్తారు. ఎవరికైనా అధిక
వృత్తి నైపుణ్యాలు ఉన్నాసరే.. అప్పటికే ఆ దేశ కోటా పూర్తయితే వారికి గ్రీన్
కార్డు అమెరికా ఇవ్వలేకపోతోంది. ఈ పరిమితిని ఎత్తేస్తోంది. అంటే ఏ దేశంలో
పుట్టాడనే అంశంతో సంబంధంలేకుండా అత్యున్నత వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను ఒకే
దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో తీసుకునేందుకు ఈగల్ చట్టం అవకాశం కల్పిస్తుంది.