చైనా లో ఎట్టకేలకు జీరోకొవిడ్ నిబంధనలను సడలించారు. స్వల్ప లక్షణాలు ఉన్న
వారు ఇంట్లోనే ఏకాంతంలో ఉండొచ్చు. జీరో కొవిడ్ నిబంధనలను సడలిస్తూ చైనా
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దాదాపు 10 రోజులుగా డజనుకు పైగా నగరాల్లో
జీరో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఈ
ప్రకటన వెలువడటం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం తరచూ కొవిడ్ పరీక్షలు
చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న
వారు ఇంట్లోనే ఏకాంతంలో గడపొచ్చు. గతంలో ఇటువంటి లక్షణాలు ఉన్నవారిని బలవంతంగా
వైద్యశాలలకు తరలించేవారు. గతంలో ఏదైనా భవనంలో కొవిడ్ కేసు వస్తే ఆ ప్రాంతం
మొత్తాన్ని సీల్ చేసేవారు. కానీ, ఇక ఆ విధానం అమలు చేయరు. ఆ భవనం నుంచి బయటకు
వెళ్లే మార్గాలను తెరిచే ఉంచుతారు. ఈ విషయాన్ని బీజింగ్‌లోని నేషనల్ హెల్త్
కమిషన్ ప్రకటించింది. చైనా లో కఠిన లాక్డౌన్లతో జీరోకొవిడ్ పాలసీని అమలు
చేసి వైరస్ కట్టడి చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ భావించారు. దీనిని సీసీపీ
ఘనతగా ప్రచారం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో వైరస్‌పై ప్రజాయుద్ధం
ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో డజన్ల కొద్దీ అధికారులను
విధుల నుంచి తొలగించారు. నగరాల్లో లాక్డౌన్లు విధించారు. లాక్డౌన్లపై
ప్రశ్నించిన ప్రజలు, వైద్య నిపుణుల నోళ్లను బలవంతంగా మూయించారు. దీని అమలును
డిజిటల్ నిఘా కిందకు తీసుకొచ్చారు. దీంతో ప్రజలు బయటకు కదలాలన్నా
ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థకు ఇవి భారంగా
పరిణమించాయి. దీంతోపాటు గ్వాంగ్‌ఝూ, బీజింగ్ వంటి పలు చోట్ల ఆందోళనలకు కారణం
అయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు 10 నిబంధనల్లో చైనా సడలింపులు ఇచ్చింది.