చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్(96) కన్నుమూశారు. దేశం అతలాకుతలంగా
ఉన్న సమయంలో పగ్గాలు చేపట్టి, వ్యవస్థను గాడిలో పెట్టి, దేశాభివృద్ధికి బాటలు
వేసిన నాయకుడిగా చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ఆయన్ను పరిగణిస్తుంటుంది.
1926, ఆగస్టు 17న యాంగ్షౌ నగరంలో జియాంగ్ జన్మించారు. 1989లో సీసీపీ కేంద్ర
సైనిక కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. 1993లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు
స్వీకరించారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో చైనా బలమైన ఆర్థిక వ్యవస్థగా
ఆవిర్భవించింది. జియాన్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చైనా మాజీ
అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని
నరేంద్ర మోదీతో సహా పలువురు అంతర్జాతీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.