కఠినమైన శీతాకాలంలోనూ రష్యా దళాలతో పోరాటం కొనసాగించాలని తమ దేశం యోచిస్తోందని
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మంగళవారం మీడియాకు తెలియజేశారు.
ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పటి నుంచి, ఉక్రేనియన్ మిలిటరీ
సున్నా ఉష్ణోగ్రతల్లో ఎప్పుడూ పోరాడాల్సిన అవసరం రాలేదన్నారు. రష్యన్లతో
పోరాటం ఏ ఒక్క రోజూ ఆగిపోలేదన్నారు. రష్యా సైన్యం శక్తి వనరుల పై దాడి చేయడం
తీవ్రంగా ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే వారు ఏం చేసినా పోరాడి గెలుస్తామని
కులేబా పేర్కొన్నారు. శీతాకాలంలో ఉక్రేనియన్ దళాలను “లాక్ డౌన్” చేస్తారా అని
కులేబాను విలేకరులడగగా అతను ప్రతిస్పందించాడు. “మేము ఒక్క రోజు కూడా ఆగము,
ఎందుకంటే ప్రతి విరామం రష్యన్లు భూమిని తవ్వడానికి, కోటలను నిర్మించడానికి,
ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల్లో వారి రక్షణ రేఖలను బలోపేతం చేయడానికి ఎక్కువ
సమయం తీసుకుంటుంది.” అని సమాధానమిచ్చారు.