రెండు నెలలకు పైగా పోరాడుతున్నందున మహిళలు తలలు కప్పుకోవాలనే(హిజాబ్) దశాబ్దాల
నాటి చట్టాన్ని సమీక్షిస్తున్నట్లు ఇరాన్ శనివారం తెలిపింది. ఇరాన్ అటార్నీ
జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంటాజెరి మాట్లాడుతూ చట్టంలో ఏవైనా మార్పులు అవసరమా?
లేదా? అని నిర్ధారించడానికి “పార్లమెంట్, న్యాయవ్యవస్థ రెండూ (ఈ సమస్యపై) పని
చేస్తున్నాయి” అని అన్నారు. షరియా ఆధారిత చట్టాన్ని ఉల్లంఘించినందుకు
పోలీసులచే అరెస్టు చేయబడిన కుర్దిష్ వర్గానికి చెందిన 22 ఏళ్ల ఇరానియన్ మహ్సా
అమినీ కస్టడీలో సెప్టెంబర్ 16 న మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో
అట్టుడుకుతోంది. ఆందోళనకారులు తలకు వస్త్రాలను కప్పుకుని, ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహ్సా అమిని మరణించినప్పటి నుంచి అధిక సంఖ్యలో
మహిళలు హిజాబ్‌ను పాటించడం లేదు. ముఖ్యంగా టెహ్రాన్‌లోని నాగరీకమైన నగరంలో
హిజాబ్ పై నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.