రష్యాలోని అమెరికన్ ఖైదీ పాల్ వీలన్ తో శుక్రవారం ఉదయం అతడి సోదరుడు
మాట్లాడినట్టు తెలిసింది. ఒక వారంలో వీలన్ తో మాట్లాడటం మొదటిసారి అని అతడి
సోదరుడు గుర్తుచేసుకున్నాడు. అమెరికన్ ఖైదీ గురించి వైట్ హౌస్ ఆందోళన
చెందుతోంది. వీలన్ సోదరుడు డేవిడ్ వీలన్ మాట్లాడుతూ వీలన్ను జైలు ఆసుపత్రికి
తరలించినట్లు క్యాంపు అధికారులు చెప్పారని, అయితే వివరాలు ఇవ్వలేదని చెప్పాడు.
కాగా, ‘మిస్టర్ వీలన్ పరిస్థితి, అతని ఆచూకీ గురించి మరింత సమాచారం పొందడానికి
మేము ప్రయత్నిస్తున్నాము. మేము ఈ ఉదయం మాట్లాడినప్పుడు, విచారకరంగా, అతను
ఎక్కడ ఉన్నాడు లేదా అతను ఏ స్థితిలో ఉన్నాడు అనే దాని గురించి మాకు
ప్రత్యేకంగా అప్డేట్ లేదు’ అని వైట్ హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ
బుధవారం టెలిఫోన్ బ్రీఫింగ్లో విలేకరులతో అన్నారు. కాగా, గూఢచర్యం ఆరోపణలపై
2018 నుంచి పాల్ వీలన్ రష్యా జైలులోనే మగ్గుతున్నాడు.