వాషింగ్టన్ : అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలను రక్షించేందుకు
ద్వైపాక్షిక చట్టానికి సెనెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఇలాంటి
వివాహాలకు 2015లో చట్టబద్ధత కల్పించాక ఒక్కటైన వేల మందికి సెనెట్ నిర్ణయంతో
ఊరట లభించింది. స్వలింగ, విజాతీయుల మధ్య పెళ్లిళ్లను ఫెడరల్ చట్టంలో
పొందుపరిచేందుకు సంబంధించిన ఈ బిల్లుకు సెనెట్‌లో 61-36 ఓట్లతో మద్దతు
లభించింది. 12 మంది రిపబ్లికన్లు కూడా సమర్థించారు. బిల్లుపై సెనెట్ మెజారిటీ
నాయకుడు ఛక్షూమర్ మాట్లాడుతూ చాలాకాలంగా చర్చల్లో ఉన్న బిల్లును ఆమోదించడం
కొంత కష్టమైనా అమెరికాకు సంబంధించిన సమానత్వపు కవాతులో గొప్ప ముందడుగని
అన్నారు. బిల్లు తుది ఆమోదానికి హౌస్‌కు వెళ్లనుంది. ఈ సందర్భంగా అధ్యక్షుడు
జో బైడెన్ మాట్లాడుతూ ‘బిల్లును హౌస్ ఆమోదిస్తే నేను తప్పకుండా, సగౌరవంగా
సంతకం చేస్తా. తాము కూడా సంతోషకరమైన సంపూర్ణ జీవితాలను కొనసాగించవచ్చని,
కుటుంబాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఎల్జీబీటీక్యూ యువతకు ఈ బిల్లు ధైర్యాన్ని
కల్పిస్తుంది’ అని ప్రకటించారు. ఎల్జీబీటీక్యూల హక్కుల కోసం పోరాటం చేస్తున్న
సంస్థకు కాబోయే అధ్యక్షుడు కెల్లీ రాబిన్సన్ మాట్లాడుతూ తమ వర్గం ఈ విజయం
కోసం ఎంతగానో ఎదురుచూస్తోందన్నారు.