రేపు కాలిఫోర్నియాలో ఆవిష్కరణ
వాషింగ్టన్ : అమెరికా అమ్ములపొదిలో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ స్టెల్త్
బాంబర్ యుద్ధ విమానం బి-2 స్పిరిట్. దీని స్థానంలో అత్యాధునిక బి-21 రైడర్లు
త్వరలో చేరనున్నాయి. ‘‘ప్రపంచంలోనే ఇప్పటివరకు నిర్మించిన అత్యాధునిక సైనిక
బాంబర్ విమానం ఇదే’’ అని దీన్ని తయారుచేసిన నాథ్రాప్ గ్రమ్మన్ సంస్థ
పేర్కొంది. ఆరో తరానికి చెందిన ఈ స్టెల్త్ బాంబర్ విమానాన్ని ఆ సంస్థ
శుక్రవారం కాలిఫోర్నియాలో ఆవిష్కరించనుంది. ఒక్కో బి-21 రైడర్ ఖరీదు
సుమారు.16,200 కోట్లు. ప్రారంభంలో మొత్తం ఆరు రైడర్లను ఈ సంస్థ తయారు
చేయనుంది. 2023లోపు ఇవి అమెరికా సైన్యంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు
నిర్వహించే అవకాశం ఉంది. సంప్రదాయ, అణ్వాయుధాలతో పాటు..భవిష్యత్తులో
వినియోగంలోకి రానున్న లేజర్ ఆయుధాలనూ ప్రయోగించే సామర్థ్యం ఈ బి-21 రైడర్ల
ప్రత్యేకత. ప్రత్యర్థులకు చిక్కకుండా..దొరకకుండా ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా
ఇవి ఛేదించగలవు.