ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటా
ఉల్లంఘనకు గురైంది. ఆన్లైన్ యూజర్ల అతిపెద్ద డేటా ఉల్లంఘనల్లో ఇది ప్రధానంగా
ఉంది. దాదాపు 500 మిలియన్ల (50కోట్ల మంది) వాట్సాప్ వినియోగదారుల ఫోన్
నెంబర్లు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేశారు. సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం..
హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో 487 మిలియన్ వాట్సాప్ యూజర్ మొబైల్ నెంబర్ల 2022
డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక ప్రకటన పోస్ట్ చేశారు. డేటాబేస్
అమెరికా, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారత్ సహా 84 వేర్వేరు దేశాల
నుంచి వాట్సాప్ యూజర్ల మొబైల్ నంబర్లను కలిగి ఉంది. ఉల్లంఘనకు గురైన డేటాలో
ఎక్కువగా ఫిషింగ్ అటాక్స్ ద్వారానే ఉన్నట్టు కనిపిస్తోంది. వాట్సాప్ యూజర్లు
తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం మంచిదని సైబర్
నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.