ఇటాలియన్ ఐలాండ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది
ప్రాణాలు కోల్పోయారు. అలాగే 13 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. అక్కడ రెండు
రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్షియా
ద్వీపానికి ఉత్తరాన ఉన్న కాసామిసియోలా టెర్మ్‌లో శనివారం తెల్లవారుజామున కొండ
చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయిన విషయాన్ని ఇటలీ మంత్రి మాటియో
సాల్విని ధ్రువీకరించారు. “ఇస్షియా కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది
మరణించారు. రెస్క్యూ సిబ్బంది క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు”
అని ఆయన చెప్పారు.