తనపై దాడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్
ఖాన్ ప్రజల్లోకి వచ్చారు. రావల్పిండిలో శనివారం ఓ సభలో పాల్గొని
ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని అన్ని అసెంబ్లీల నుంచి తమ పీటీఐ
పార్టీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
ఈ మేరకు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక, తనకు మరోసారి
ప్రాణహాని ముప్పు ఉందని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల వజీరాబాద్ లో దాడి వెనుక
ఉన్న ‘ముగ్గురు నేరస్తులు’ తనను చంపడానికి మరో అవకాశం కోసం చూస్తున్నారని
ఇమ్రాన్ ఆరోపించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణా సనావుల్లా,
ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ తనపై దాడి
వెనుక సూత్రధారులు అని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ
ముగ్గురినీ ఆయన ‘క్రిమినల్స్’ అని అభివర్ణిస్తున్నారు.