సౌదీ అరేబియాలో ఫిఫా అధికారిక ప్రపంచ కప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ బ్లాక్
చేయబడింది. అక్కడ beIN మీడియా గ్రూప్ యాజమాన్యంలో Tod TV ఉంది. ఖతార్ తో
వివాదం కారణంగా ఈ ఖతారీ మీడియా గ్రూపును సౌదీ అరేబియాలో చాలా సంవత్సరాల
క్రితమే నిషేధించారు. అయితే 2021 ఆఖరులో తిరిగి అనుమతించడం జరిగింది. మళ్ళీ
నవంబర్ 20న ప్రపంచ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ఖతార్ బ్రాడ్‌కాస్టర్ TOD.tv
స్ట్రీమింగ్ సర్వీస్‌ను సౌదీ అరేబియా బ్లాక్ చేసింది. 10 నెలల సాఫీ
కార్యకలాపాల తర్వాత అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడిందని రాయిటర్స్ పత్రికలో
కథనాలు వెలువడ్డాయి. అయితే శాటిలైట్ లో వచ్చిన సాంకేతిక లోపాల కారణంగా ఈ సమస్య
తలెత్తినట్లు ఖతార్ ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, “TOD.tv, FIFA
వరల్డ్ కప్ ఖతార్ 2022 అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి, ప్రస్తుతం సౌదీ
అరేబియా రాజ్యంలో మా నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా అంతరాయాన్ని
ఎదుర్కొంటోంది. మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇక్కడ పోస్ట్
చేస్తాం” అని దాని అనుబంధ సంస్థలు, చెల్లింపు కస్టమర్లకు ఇమెయిల్ ద్వారా beIN
మీడియా గ్రూప్ తెలియజేసింది.