రక్తానికి సంబంధించి ‘హిమోఫిలియా బి’ అనే ఆరోగ్య సమస్యకు ప్రపంచంలోనే అత్యంత
ఖరీదైన ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీనికి ఇటీవలే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ
ఎఫ్డీఏ ఆమోదముద్ర వేసింది. ఆస్ట్రేలియాలోని దీని తయారీ సంస్థ ‘సీఎస్ఎల్
లిమిటెడ్’ ఔషధ ధరను 3.5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించింది. అంటే మన
కరెన్సీలో రూ.28.61 కోట్లు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చికిత్సగా
నిలిచింది. రక్తం గడ్డకట్టడంలో సమస్యలతో కూడిన అరుదైన లోపానికి అందుబాటులోకి
వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇది. ప్రతి 40 వేల మందిలో ఒకరు ఇటువంటి ఆరోగ్య
సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 (ix) అనే
ప్రొటీన్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ప్రస్తుతం పలు సంస్థల నుంచి
అందుబాటులో ఉన్న చికిత్సలతో పోలిస్తే సీఎస్ఎల్ అందుబాటులోకి తెచ్చిన చికిత్స
దీర్ఘకాలం ప్రభావవంతంగా ఉంటుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలో
జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని లివర్లో
ప్రవేశపెడుతుంది. అప్పుడు కాలేయం నుంచి ఫ్యాక్టర్-9 (ix) విడుదలవుతుంది.
హీమోజెనిక్స్ పేరిట అమెరికాలో దీని విక్రయాలు కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే
ఈ లోపానికి చికిత్స చేసేందుకు అందుబాటులో ఉన్న రెండు ఔషధాల్లో ఒకటి 2.8
మిలియన్ డాలర్లు కాగా.. మరో ఐషధం 3 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.