దిగ్గజ వ్యాపారవేత్త స్టీవ్ జాబ్స్ పాత చెప్పులను ఇటీవల వేలం వేశారు. అయితే
అవి ఊహించిన ధరకంటే రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి.
యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ పాత చెప్పులను ఇటీవల వేలం
వేశారు. అందులో 2లక్షల 18వేల అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.1కోటి 78లక్షలు)
వాటిని ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన జూలియన్స్ అనే సంస్థ
పలు వస్తువులను ఆన్లైన్లో వేలానికి పెట్టింది. అందులో స్టీవ్ జాబ్స్ వాడిన
బిర్కెన్‌స్టాక్ ఆరొజోనా కంపెనీకి చెందిన లెదర్ చెప్పులను ఉంచింది.
1970, 80 దశకంలో యాపిల్ కంప్యూటర్ రూపొందించే కీలక సమయాల్లో స్టీవ్‌జాబ్స్
వీటిని వాడారని పేర్కొంది. కొన్నేళ్లపాటు వాడినందున వాటిపై ఆయన కాలి ముద్రలు
స్పష్టంగా ఉన్నాయని వివరించింది. వేలంలో వాటికి 60వేల డాలర్లు వస్తాయని
ఊహించగా.. రికార్డు స్థాయిలో 2,18,750 డాలర్లకు అవి అమ్ముడు పోయినట్లు
తెలిపింది. వాటిని కొన్న వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.