ఓవర్ డలాస్’ అనే వైమానిక ప్రదర్శనలో గాల్లో ఎగురుతున్న రెండు పాత
యుద్ధవిమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాల్లోని ఆరుగురు
సిబ్బంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. మృతులను గుర్తించేందుకు
యత్నిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నగరానికి 10మైళ్ల దూరంలో ఉన్న డలాస్
ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన పలువురి
కెమెరాలు, ఫోన్లలో చిక్కడంతో సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియోలు
చక్కర్లు కొట్టాయి. విమానాలను పూర్తిగా సుశిక్షితులైన వాలంటీర్లు నడిపారని
అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ రవాణా భద్రత బోర్డు(ఎన్టీఎస్ బీ) రంగంలోకి
దిగి స్థానిక పోలీసులకు, సహాయక సిబ్బందికి సాయం చేస్తోందని డలాస్ మేయర్
ఎరిక్ జాన్సన్ తెలిపారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు చాలా బాధాకరంగా ఉన్నాయని ఆయన ట్విటర్లో ఆవేదన
వ్యక్తం చేశారు. రెండు విమానాల్లో ఒకటి బీ-17 ఫ్లైయింగ్ ఫ్లోరేట్రస్ విమానం
కాగా.. మరొకటి పీ-63 కింగ్‌కోబ్రా యుద్ధవిమానం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో
బీ-17 అమెరికా అమ్ములపొదిలో కీలక అస్త్రంగా వ్యవహరించింది. వీటి సహాయంతో
జర్మనీపై పట్టపగలే అమెరికా దాడులు చేయగలిగింది. బోయింగ్ సంస్థ వీటిని
తయారుచేసింది. ప్రస్తుతం ఈ విమానాలు ప్రపంచంలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని
మాత్రమే ఉన్నాయని బోయింగ్ పేర్కొంది. ఇక కింగ్ కోబ్రాను సోవియట్ బలగాలు
వినియోగించాయి. కాగా.. వింగ్స్ ఓవర్ డలాస్ షో ఈ నెల 11 నుంచి 13 వరకూ
జరుగుతుండగా.. చివరి రోజు ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.