వెలువడింది. అయితే ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్
హాజరవుతున్నారు. మరోవైపు పుతిన్ వస్తే తాను రానని చెప్పారు ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై ప్రపంచ
వ్యాప్తంగా పలు దేశాలు వ్యతిరేకత చూపుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ జీ-20
సదస్సులో కూడా కనిపించనుంది. అందుకే వచ్చే వారం జరగనున్న సమావేశంలో ఫ్యామిలీ
ఫొటో దిగొద్దని ప్రపంచ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సదస్సు
మొదలుపెట్టే ముందు ఈ నేతలంతా ఒకదగ్గర నిల్చొని ఫొటోకు పోజు ఇస్తారు. అయితే
ఈసారి అది మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
రష్యా చేపడుతోన్న ప్రత్యేక ఆపరేషన్‌పై వస్తోన్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ దేశ
అధ్యక్షుడు పుతిన్ జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదని ఇప్పటికే ప్రకటన
వెలువడింది. అయితే ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్
హాజరవుతున్నారు. ఈ యుద్ధం సమయంలోనే ఇదివరకు జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో
నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ ఆహార సంక్షోభానికి ఈ దాడి కారణం
కాదని లావ్రోవ్ వాదించారు. ఆ మాట చెప్పి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఇదిలా
ఉంటే ఈ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వర్చువల్‌గా
ప్రసంగించాలని కోరగా పుతిన్ వస్తే, తాను ఇందులో భాగంకానని ఆయన వెల్లడించారు.
అలాగే రష్యా జీ-20లో భాగంగా ఉంటే, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రావడం
వీలుకాకపోవచ్చని బ్రిటన్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచంలో శక్తిమంతమైన
కూటమిగా పేరుగాంచిన జీ-20 పాలనా పగ్గాలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్
స్వీకరించనుంది. ఈ కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా,
ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్
కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, అమెరికా, ఐరోపా
సమాజం(యూరోపియన్ యూనియన్) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సమావేశం ఈ నెల 15-16
తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరగనుంది.