హైతీలో గ్యాస్ స్టేషన్లు రెండు నెలల తర్వాత తిరిగి తెరవబడ్డాయి. శనివారం
తెల్లవారుజామున పోర్ట్-ఓ-ప్రిన్స్ వీధులు వాహన శబ్దాలతో మోతెక్కాయి.
కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్లపై గ్యాస్ స్టేషన్ల వద్దకు వెళ్లాయి.ఇది
పోర్ట్-ఓ-ప్రిన్స్ చుట్టూ వినబడే ఆనందాల తరంగాన్ని ప్రేరేపించింది.
వినియోగదారులు తమ వాహనాలను పెట్రోల్ బంకులకు వేలాదిగా తీసుకెళ్లారు. G9 అని
పిలవబడే ఒక ముఠా సమాఖ్య సెప్టెంబరు మధ్యలో కీలకమైన ఇంధన టెర్మినల్ చుట్టూ ఉన్న
ప్రాంతంపై నియంత్రణను స్వాధీనం చేసుకుంది. దీంతో హైతీలో జనజీవనం
స్తంభించిపోయింది, జీన్-పియర్ వంటి లక్షలాది మంది వ్యక్తులు తాత్కాలికంగా పని
లేకుండా పోయారు. ఎంతోమంది ఉపాధిని సైతం కోల్పోయారు. ఈ క్రమంలో రెండు నెలల
తర్వాత హైతీలోని గ్యాస్ స్టేషన్లను పునరుద్ధరిస్తూ అక్కడి అధికారులు
చర్యలు తీసుకున్నారు.