అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దళాలు దోపిడీలకు పాల్పడుతున్నాయని
ఆరోపించింది తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు ఒక నగరంలోకి
ట్యాంకులతో ప్రవేశించినట్లు రష్యా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జెలెన్స్కీ
స్పందించారు. రష్యన్లు కూడా నిత్యం ఈ ప్రాంతంలో డజన్ల కొద్దీ భీకరదాడులు
చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయినా ఉక్రెయిన్ సేనల ఎదురుదాడుల్లో మాస్కో
దళాలు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక ప్రాంతమైన
దొనెట్స్క్‌లోని బాక్ముత్, సోలెడార్, అవదివ్కా కోసం భీకర పోరు జరుగుతోంది.
స్నిహురివ్కా నగరంలో రష్యా నియమించిన మేయర్ యారి బరాబాషోవ్ మాట్లాడుతూ
కొన్ని ఉక్రెయిన్ ట్యాంకులు నగరంలోకి ప్రవేశించడంతో దాడులు జరుగుతున్నట్లు
స్థానికుల నుంచి సమాచారం అందిందన్నారు.
ఈ విషయాన్ని ఖేర్సన్ డిప్యూటీ హెడ్ కిరిల్స్టెర్ముసోవ్ కూడా
ధ్రువీకరించారు. ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ దళాలు మూడు ప్రాంతాల నుంచి
చొరబడేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిల్లో స్నిహురివ్కా కూడా
ఉన్నట్లు వెల్లడించారు. లుహాన్స్క్లో దాదాపు 21 మంది రష్యా నిర్బంధ సైనికులు
లొంగిపోయినట్లు సమాచారం. ఈ సైనికుల వద్ద తినడానికి తిండి, తాగడానికి నీరు వంటి
కనీస సౌకర్యాలు లేకపోవడంతో గత్యంతరం లేక లొంగిపోయినట్లు కీవ్‌కు చెందిన సైనిక
విశ్లేషకుడు ఓలెహ్ జోదనోవ్ పేర్కొన్నారు. ఖేర్సన్లో రష్యా దళాలు దోపిడీలకు
పాల్పడుతున్నాయని కీవ్ ఆరోపించింది. అక్కడి మౌలక వసతులను కూడా ధ్వంసం
చేస్తున్నాయని పేర్కొంది. దోచుకొన్న సామగ్రిని ట్రక్కులపై రష్యాకు
తరలిస్తున్నారని.. మొబైల్ టవర్లనూ ధ్వంసం చేసి అక్కడి పరికరాలను రష్యా
సైనికులు తీసుకెళుతున్నారని వెల్లడించింది. ఖేర్సన్ నగరంలోని మ్యూజియం నుంచి
కళాఖండాలను రష్యన్లు దొంగిలించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది.