కిమ్‌కు కానుకలుగా డ్రోన్లు, బుల్లెట్ ఫ్రూఫ్ కోటు
సియోల్ : అంతర్జాతీయంగా భయాందోళనలు రేకెత్తించిన ఉత్తరకొరియా అధినేత కిమ్
జోంగ్ ఉన్ ఆరు రోజుల రష్యా పర్యటన ఆదివారం ముగిసింది. ఆయన తాను వచ్చిన
రైలులోనే స్వదేశానికి పయనమయ్యారు. ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని ఆర్టెమ్
నగరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో రష్యా మంత్రులు, ఉన్నతాధికారులు
పాల్గొన్నారు. కిమ్‌కు ప్రిమోర్ ప్రాంత గవర్నర్.. ఐదు ఆత్మాహుతి డ్రోన్లు,
ఒక నిఘా డ్రోన్, ఒక బుల్లెట్ ఫ్రూఫ్ కోటు బహుమతులుగా ఇచ్చారు. ఈ పర్యటనలో
ఇరు దేశాల మధ్య ఆయుధ ఒప్పందాలు జరుగుతాయని అమెరికా, దక్షిణ కొరియా, ఇతర పశ్చిమ
దేశాలు భయపడ్డాయి. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాకు ఉత్తరకొరియా మందుగుండు
సామగ్రి, అందుకు ప్రతిగా ఆ దేశానికి అణుసామర్థ్యం పెంచుకొనే సాంకేతికతను
మాస్కో బదిలీ చేయొచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా ఎలాంటి
ఒప్పందాలను ఇరు దేశాలు ప్రకటించలేదు. మంగళవారం రైలు మార్గం ద్వారా రష్యాలోకి
ప్రవేశించిన కిమ్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా
ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. పసిఫిక్ తీరంలో రష్యా హైపర్‌సానిక్
క్షిపణులను, అత్యాధునిక నౌకలను పరీక్షించారు