ఉక్రెయిన్ పై క్షిపణులతో రష్యా దాడి చేసింది. దీంతో రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాల్లో విద్యుత్తు, నీటి సరఫరా నిలిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కీవ్‌లో రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా కీవ్ జిల్లాలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే ఖార్కీవ్ నగరంలో కీలక కేంద్రాలను టార్గెట్ చేశారు. క్రిమియాలోని నల్లసముద్రం దళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందన్న సమాచారంతో రష్యా మిస్సైల్‌ను ప్రయోగించింది. సోమవారం ఉదయం విన్నిసియా ప్రాంతంపై కూడా దాడి జరిగింది. జపొరిజియా ప్రాంతంలో ఉన్న హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌పై కూడా దాడి జరిగింది. కీవ్‌లో విద్యుత్ కు అంతరాయం కలగడంతో సుమారు 3.5 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, తాజా దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయం ఇంకా తెలియరాలేదు.