వాషింగ్టన్ : రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత
సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఏకంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవల రిపబ్లికన్ పార్టీ తొలి టీవీ డిబేట్
జరిగింది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ పాల్గొనలేదు. ఈ చర్చా కార్యక్రమంలో
వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ తదితర ఆశావహులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై
తాజాగా ట్రంప్ తన అభిప్రాయం వెల్లడిస్తూ ‘డిబేట్లో వివేక్ రామస్వామి
నిజాయతీ కారణంగా భారీ విజయం సాధించినట్లు నేను భావిస్తున్నా. థాంక్యూ వివేక్
అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పేర్కొన్నారు. తొలి
డిబేట్ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో ట్రంప్ అత్యుత్తమ
అధ్యక్షుడని పేర్కొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆయన ట్రంప్‌ను బలంగా
సమర్థించారు. చర్చ సందర్భంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోపణల్లో ట్రంప్‌నకు
శిక్ష పడితే ఆయన పక్షాన ఎవరుంటారనే ప్రశ్న వచ్చింది. దీనికి ఏమాత్రం
సంకోచించకుండా వివేక్ చేయెత్తారు.