శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ పై దాడి చేసి గాయపరిచాడు.
కాలిఫోర్నియా: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ పై దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు నాన్సీ పెలోసీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయన పూర్తిగా కోలుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొంది. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని.. ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలిపింది. అయితే, ఈ ఘటన సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేరు. పాల్ పెలోసీ శాన్ఫ్రాన్స్కోలో రియల్ ఎస్టేట్, క్యాపిటల్ వెంచర్ సంస్థ నిర్వహిస్తున్నారు.