అగ్ర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రతికూల ప్రచారానికి పాల్పడకుండా ఉండాలని నేపాల్ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రజలను కోరింది. అటువంటి “తప్పుడు, తప్పుదోవ పట్టించే” ప్రచారానికి పాల్పడేవారికి సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. ఎన్నికలలో పదే పదే గెలిచిన నేపాల్ అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులపై ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నందున, నేపాల్లోని ఎన్నికల సంఘం వారంలోపు ఇటువంటి హెచ్చరిక జారీ చేయడం ఇది రెండవసారి కావడం విశేషం. “కొందరు అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ప్రతికూల ప్రచారం చేయవద్దు, ఎందుకంటే దానిని ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’గా పరిగణించలేము” అని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా నవంబర్ 20న నేపాల్ లో ఎన్నికలు జరగనున్నాయి.