పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, ఐఎస్ఐ మధ్య పోటీ పెద్ద సమస్యగా మిగిలింది. దేశ గూఢచార సంస్థకు గట్టి వార్నింగ్ ఇస్తూ, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ నిఘా వ్యవస్థను హెచ్చరించారు. ‘తాను ఐఎస్ఐని బట్టబయలు చేయగలనని, కానీ దేశ అభివృద్ధి కోసం అలా చేయకూడదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని లిబర్టీ చౌక్ నుంచి ఇస్లామాబాద్ వరకు హక్కీ ఆజాదీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఐఎస్ఐ డీజీ (ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్) నదీమ్ అంజుమ్ చెవులు విప్పి వినాలన్న ఇమ్రాన్.. తనకు చాలా విషయాలు తెలుసని అన్నారు. కానీ తన దేశానికి హాని చేయకూడదనుకోవడం కారణంగా తాను మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసం నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నానని చెప్పారు. తాను ఎవరినీ లెఫ్టినెంట్ జనరల్‌గా నియమించాలని ఎప్పుడూ అనుకోలేదని.. యోగ్యత లేని నిర్ణయం నేనెప్పుడూ తీసుకోలేదని వ్యాఖ్యానించారు. “నా దేశాన్ని విడిపించి, పాకిస్తాన్‌ను స్వేచ్ఛా దేశంగా మార్చడమే నా ఏకైక లక్ష్యం” అని ఒక కంటైనర్‌పై నిలబడి ఖాన్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్‌కు మాజీ ప్రధాని లాభదాయకమైన ప్రతిపాదన చేశారని ఐఎస్ఐ చీఫ్ చెప్పిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ,