ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రి జైశంకర్..
ఆరోపణలను తోసిపుచ్చిన పాక్..
2008 నవంబర్ 11 ముంబై ఉగ్రవాద దాడులకు కారణమైన లష్కరే తోయిబా ఉగ్రవాదులను విచారించడంలో, శిక్షించడంలో ఇస్లామాబాద్ విఫలమైందన్న భారత్ విమర్శలను పాకిస్థాన్ శుక్రవారం తోసిపుచ్చింది. ఈ కేసును “సమర్థవంతంగా పరిష్కరించడం” కోసం ఇస్లామాబాద్‌కు “తిరుగులేని, చట్టబద్ధంగా సమర్థించదగిన సాక్ష్యం” అవసరమని పేర్కొంది. ముంబైలో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రవాద వ్యతిరేక కమిటీ ప్రత్యేక సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పలు అంశాలను ప్రస్తావించారు. నవంబర్ 26, 2008, ముంబై ఉగ్రదాడులకు ప్రధాన కుట్రదారులు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ రక్షణలో కొనసాగుతున్నారని అన్నారు. అతనిపై పాక్ ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై జై శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబై దాడుల్లో వారి పాత్రకు శిక్ష పడని లష్కరేటర్ చీఫ్ హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదుల గురించి ఆయన ప్రస్తావించారు. దీన్ని పాక్ తోసిపుచ్చింది.