ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయం ఏదంటే.. అమెరికాలోని పెంటగాన్ అని చాలామంది
చెబుతారు. దీన్ని మించిన పెద్ద కార్యాలయం ప్రపంచ వజ్రాల రాజధానిగా గుర్తింపు
పొందిన గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించడం విశేషం. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు
సూరత్‌లోనే తయారు చేస్తారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు
వస్తుంటారు. వ్యాపారం సులువుగా సాగేందుకు ‘సూరత్ డైమండ్ బోర్స్’ (ఎస్డీబీ)
సంస్థ కార్యాలయ నిర్మాణం చేపట్టింది. సుమారు నాలుగేళ్లపాటు నిర్మాణపనులు
కొనసాగాయి. నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. భారతీయ
ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. 65,000 మంది
ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 35 ఎకరాల్లో, 15 అంతస్తుల భవనాలతో దీన్ని
నిర్మించారు. నిర్మాణానికి ముందే ఇందులో అన్ని కార్యాలయాలను డైమండ్ కంపెనీలు
కొనుగోలు చేశాయని ఎస్డీబీ తెలిపింది.