కెనడా : నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కెనడా ప్రభుత్వం
హెచ్1-బీ వీసా నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్1-బీ
వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు కెనడాలో మూడేళ్లు పని చేసుకోవచ్చు.
దీనివల్ల భారత్ సహా ఇతర దేశాలకు చెందిన హెచ్1-బీ వీసా దారులకు లబ్ధి
చేకూరనుంది. అంతేకాకుండా, హెచ్1-బీ వీసాదారుల కుటుంబసభ్యులకు ఉద్యోగం
చేసుకోవడంతో పాటు, చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త నిబంధన ఏడాది పాటు
లేదా 10 వేల దరఖాస్తులను స్వీకరించే వరకే అందుబాటులో ఉంటుందని కెనడా ప్రభుత్వం
తెలిపింది. కెనడా, అమెరికాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న
కంపెనీల్లో హై-టెక్ విభాగాల్లో ఎన్నో వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వీరిలో హెచ్1-బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న వారు మూడేళ్లపాటు కెనడాలో పని
చేసుకునేందుకు జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కెనడా ప్రభుత్వం
తెలిపింది. దరఖాస్తు అనంతరం అనుమతి పొందిన వారు కెనడాలో ఏ ప్రాంతంలోనైనా, ఏ
సంస్థలోనైనా ఉద్యోగం చేసుకోవచ్చని పేర్కొంది. వారి కుటుంబసభ్యులు ఉద్యోగం లేదా
చదువు కోసం తాత్కాలిక వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొంత కాలంగా
కెనడా పలు సాంకేతిక రంగాల్లో ఎదగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు
కంపెనీలు లేఆఫ్‌లు విధిస్తుండటంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తమ దేశానికి
ఆహ్వానించాలని నిర్ణయించింది.