కీవ్ : ఉక్రెయిన్‌కు చెందిన అత్యంత కీలకమైన ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా భారీ
ఎత్తున దాడులకు పాల్పడింది. కెర్చ్ (క్రిమియా) వంతెనపై దాడి జరిగిన 24
గంటల్లో మాస్కో ఈ దాడులు చేయడం గమనార్హం. కల్బిర్ క్షిపణులు, ఇరాన్‌కు చెందిన
డ్రోన్లను ఈ దాడుల్లో వాడింది. ఆరు కల్బిర్ క్షిపణులు, 25 డ్రోన్లను, ఒక
మానవరహిత నిఘా విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసిందని ఉక్రెయిన్
పేర్కొంది. రష్యా ఫ్రిగేట్ల నుంచి వీటిని ప్రయోగించినట్లు ఆ దేశ అధికారులు
తెలిపారు. కూల్చివేతకు గురైన క్షిపణులు, డ్రోన్ల శిథిలాలు చెల్లాచెదురుగా
పడటంతో ఓడరేవులోని కొన్ని సౌకర్యాలు, మరికొన్ని నివాస భవనాలు దెబ్బతిన్నాయని
వెల్లడించారు. ఈ సందర్భంగానే ఓ వృద్ధుడు గాయపడ్డాడని తెలిపారు. ఇదిలా ఉండగా
క్రిమియాపై ఉక్రెయిన్ ప్రయోగించిన 28 డ్రోన్లను నేల కూల్చామని రష్యా రక్షణ
శాఖ వెల్లడించింది.

బెలారస్ చేరిన వాగ్నర్ గ్రూపు దళాలు : రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు
దళాలు బెలారస్‌కు చేరుకొన్నాయి. అక్కడ ఓ పాత సైనిక స్థావరంలో శిబిరాన్ని
ఏర్పాటు చేసుకొన్నాయి. మరో రెండు కాన్వాయ్‌లు కూడా బెలారస్ దిశగా
వెళుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు పేర్కొన్నాయి. దాదాపు 100కు పైగా ఉన్న ఈ
వాహనాల్లో చాలా వాటిపై వాగ్నర్ పతాకాలున్నాయి. రష్యాలో తిరుగుబాటు విఫలమయ్యాక
వాగ్నర్ దళాలు తొలిసారి బహిరంగంగా కనిపించాయి. మరో రెండు వందల వాహనాలు కూడా
బెలారస్ దిశగా వెళుతున్నట్లు సమాచారం.