మాస్కో : కెర్చ్ వంతెనపై దాడికి ప్రతికారంగా చర్య తప్పదని రష్యా అధ్యక్షుడు
పుతిన్ అన్నారు. అందుకు తమ సైనిక బలగాలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెప్పారు.
కెర్చ్ వంతెనపై జరిగిన పేలుళ్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఈ
దాడికి ప్రతికారం తీర్చుకుంటామని ఆయన ఉక్రెయిన్ను హెచ్చరించారు. క్రిమియా
ద్వీపకల్పాన్ని రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్ వంతెనపై సోమవారం వేకువ
జామున 3 గంటల సమయంలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు చనిపోయారు. దీంతో
రష్యా ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి భద్రతా చర్యలు పటిష్ఠం చేసింది. ఈ
ఘటనలో క్రిమియా వంతెన రోడ్డు మార్గంలో కొంత దెబ్బతిందని రష్యా రవాణ శాఖ
ప్రకటించింది. అయితే ఇంతవరకు ఈ దాడి ఘటనపై ఉక్రెయిన్ స్పందించలేదు.