కాఠ్మాండూ : నేపాల్‌లో వైద్య, విద్యారంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలకు
భారతదేశం 84 వాహనాలను బహుమతిగా అందించింది. మొత్తం 34 అంబులెన్సులు, 50 పాఠశాల
బస్సులకు సంబంధించిన తాళాలను నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ ఆ
దేశ విద్యాశాఖ మంత్రి అశోక్‌కుమార్ రాయ్ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులకు
అందజేశారు. ‘భారత్-నేపాల్ అభివృద్ధి భాగస్వామ్య కార్యక్రమం’ కింద
నేపాల్‌లోని విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం
చేసుకోవడానికి ఈ సహాయం అందిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. భారత్ 1994
నుంచి ఇప్పటి వరకు మొత్తం 974 అంబులెన్సులు, 234 పాఠశాల బస్సులను నేపాల్‌కు
బహుమానంగా అందించింది.