ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ సతీమణి ఓ కప్పు కాఫీ ధరపై ఫిర్యాదు
చేయడం గురించి నెట్టింట చర్చనీయాంశమైంది. ఇతర ప్రదేశాల్లోని కాఫీ ధరతో
పోలిస్తే అక్కడ కాఫీ ధర ఎక్కువగా ఉండటంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన చెప్పే పెట్టుబడి, వ్యక్తిత్వవికాసం,
మోటివేషన్ పాఠాలను వినేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురుచూస్తుంటారు.
ప్రస్తుతం ఆయన సంపద విలువ 114 బిలియన్ డాలర్లు. ఆయన మరెవరో కాదు ప్రముఖ
ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. అయిత ప్రస్తుతం ఆయన సతీమణి ఆస్ట్రిడ్
బఫెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ కార్యక్రమంలో
భాగంగా రిసార్ట్ సిబ్బంది కాఫీ కోసం నాలుగు డాలర్లు వసూలు చేయడంపై ఆమె
ఫిర్యాదు చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. అమెరికాలోని సన్
వ్యాలీ రిసార్ట్‌లో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్ల
కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌నకు హాజరైన ఆస్ట్రిడ్
బఫెట్ రిసార్ట్ సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడం సరైన నిర్ణయం
కాదని అభిప్రాయపడ్డారు. మిగతా చోట్ల ఆ ధరకు ఒక పౌండ్ కాఫీ (32 టేబుల్
స్పూన్ల కాఫీ పొడి) కొనుగోలు చేయొచ్చని రిసార్ట్ నిర్వాహకులకు ఫిర్యాదు
చేశారట. అంతేకాకుండా సరసమైన ధరలకు కాఫీ విక్రయించాలని వారికి సూచించినట్లు
వార్తా కథనం పేర్కొంది. అయితే, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ భార్య
నాలుగు డాలర్ల కాఫీ కోసం ఫిర్యాదు చేశారనే వార్తలపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ
సమావేశంలో వారెన్ బఫెట్ ఆరోగ్యం గురించి కూడా ఆస్ట్రిడ్ వ్యాఖ్యానించారట.
కొద్దిరోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని, దానివల్ల సన్
వ్యాలీలోని ఓ కార్యక్రమంలో నడవలేక గోల్ఫ్ కోర్ట్ వాహనాన్ని ఉపయోగించినట్లు
చెప్పారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.