కీవ్: రష్యాతో 240 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన 66,750 మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ భీకరు పోరులో శుత్రుదానికి జరిగిన నష్టాన్ని ఓ చిత్రం రూపంలో విడుదల చేసింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఇరు దేశాలకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. దాదాపు 9 నెలలు కావస్తున్నా యుద్ధం ఆగే సూచలను కన్పించడం లేదు. ఉక్రెయిన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టం..
చనిపోయిన సైనికులు – 66750
ధ్వంసమైన యుద్ధ విమానాలు- 269
హెలికాప్టర్లు – 263
ట్యాంకులు – 2573
మానవ రహిత విమానాలు – 1325
స్పెషల్ ఎక్విప్మెంట్ – 147
పడవలు – 16
సాయుధ వాహనాలు – 5258
ఆయుధ వ్యవస్థలు – 1648
బహుళ రాకెట్ లాంచర్లు - 372
వాహనాలు, ఇంధన ట్యాంకులు – 4006
యుద్ధ విమాన నిర్వీర్య వవస్థలు – 189
క్రూజ్ క్షిపణులు – 329