అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది.
వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్‌కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్‌లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.