సూడాన్ : సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం
చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల
ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక
దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల
విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపై చేయి
సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. ఇరు సైనిక వర్గాల మధ్య
వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న
పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా
చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష
సాక్ష్యులు తెలిపారు. అయితే కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు
తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ
అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత
ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు
పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.
సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన
పొరుగు ప్రాంతాల నుంచి ఆర్ ఎస్ ఎఫ్ ని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా
కష్టపడింది.