వాగ్నర్‌కు పుతిన్ కంగ్రాట్స్.. జెలెన్స్కీ విచారం
రష్యా : ఉక్రెయిన్‌లో కీలకమైన బఖ్ముత్ నగరం తమ స్వాధీనం అయినట్లు రష్యా
ప్రకటించింది. వాగ్నర్ ప్రైవేటు సైన్యంతో కలిసి ఈ నగరాన్ని స్వాధీనం
చేసుకున్నట్లు పేర్కొంది. ఇక్కడ 8 నెలలకుపైగా జరిగిన పోరాటంలో ఇరువర్గాలు
వేలాది సైనికులను కోల్పోయాయి. బఖ్‌ముత్‌లో ఎటు చూసినా పెను విధ్వంసమే
కనిపిస్తోందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అక్కడ ఏమీ మిగల్లేదని
ప్రతిదాన్ని రష్యన్లు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి
బఖ్ముత్ తమ మనసుల్లో మాత్రమే ఉందని జెలెన్స్కీ వెల్లడించారు.