హిరోషిమా : ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి 1945 నాటి ప్రపంచ దేశాల
పరిస్థితులకు అనుగుణంగా ఉందని, ప్రస్తుత కాల పరిస్థితులకు తగ్గట్టు దీనిని
సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్
అన్నారు. జీ-7 సమావేశాల సందర్భంగా హిరోషిమాలో మీడియాతో ఆయన మాట్లాడారు.
కొవిడ్-19తో తలెత్తిన ఆర్థికసంక్షోభం, పర్యావరణ సమస్యలు, ఉక్రెయిన్పై రష్యా
దాడి, నిలకడ లేని రుణ భారాలు, పెరుగుతున్న వడ్డీ ధరలు, తీవ్రమైన ద్రవ్యోల్బణం
అభివృద్ధి చెందిన, అభివృద్ధి దిశగా వెళుతున్న దేశాల ఆర్థికవ్యవస్థలను
ఛిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న
సమస్యలకు అధికార సంబంధమైన కోణాలే కారణమని చెప్పారు.