ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ సీఈఓగా కొత్త వ్యక్తి బాధ్యతలు
తీసుకోనున్నారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు
ప్రస్తుత సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అయితే నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఆమె
ఎవరనే విషయాన్ని మాత్రం మస్క్ చెప్పలేదు. ట్విటర్ సీఈఓ బాధ్యతల నుంచి
తప్పుకున్న తర్వాత తాను చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీఓ), ప్రొడక్ట్,
సాఫ్ట్వేర్ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు ట్వీట్లో ఆయన పేర్కొన్నారు.