ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా మరో వివాదానికి కారణమైంది.
తమ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్ తాజాగా ఆరోపించింది. లండన్: ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా మరో వివాదానికి కారణమైంది.
తమ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్ తాజాగా ఆరోపించింది.
సెప్టెంబరు 29న నల్ల సముద్రం మీదుగా అంతర్జాతీయ గగనతలంలో గస్తీ విధుల్లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. అయితే..
సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు రష్యా పేర్కొనడం గమనార్హం. తమ నిరాయుధ విమానం(ఆర్ఏఫ్ ఆర్సీ- 135 రివెట్ జాయింట్) విషయంలో జరిగిన ఈ ఘటనను ఉద్దేశపూర్వక చర్యగా పరిగణించడం లేదని వాలెస్ తెలిపారు. అయితే.. రష్యా తన యుద్ధ విమానాలను వినియోగించే తీరు ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీయగలదో ఇది వెల్లడిస్తుందన్నారు. ఈ విషయమై..
రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగుతో తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు చెప్పారు.‘ఈ ఘటనపై తాము విచారణ జరిపినట్లు అక్టోబర్ 10న రష్యా రక్షణ శాఖ మంత్రి బదులిచ్చారు.
సుఖోయ్- 27ఎస్ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు వివరణ ఇచ్చారు’ అని వాలెస్ తెలిపారు. ఈ ఘటన అంతర్జాతీయ గగనతలంలో జరిగిందని రష్యా సైతం అంగీకరించినట్లు వెల్లడించారు.
మరోవైపు.. ఈ ఘటన అనంతరం బ్రిటన్ నల్ల సముద్రం మీదుగా తన పెట్రోలింగ్ కార్యకలాపాలు నిలిపేసినప్పటికీ.. ప్రస్తుతం ఒక యుద్ధ విమానం ఎస్కార్ట్‌తో మళ్లీ పునరుద్ధరించింది.