గుర్తింపునిచ్చేలా వారికి భాగస్వామ్యం కల్పించారు. కీలకమైన రాజచిహ్నాన్ని
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి అందజేసే అవకాశం తమకు దక్కడం ప్రపంచవ్యాప్త
సిక్కులకు లభించిన గౌరవమని లార్డ్ ఇందర్జిత్ సింగ్ (90) పేర్కొన్నారు.
బ్రిటన్‌లో సిక్కుల ప్రతినిధిగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. తనకు, సిక్కు
సమాజానికి గౌరవం ఇవ్వడం బ్రిటన్ రాజు సమ్మిళిత దృక్కోణానికి నిదర్శనమని ఆయనొక
ముఖాముఖిలో చెప్పారు. భారత్-గయానా మూలాలున్న లార్డ్ సయ్యద్ కమల్ల్
ముస్లింల ప్రతినిధిగా వెళ్లి జత కంకణాలు అందజేశారు. హిందువుల తరఫున లార్డ్
నరేంద్ర బాబూభాయ్ పటేల్ ప్రత్యేక ఉంగరాన్ని అందించారు. అన్ని మతాలకూ
పెద్దపీట వేయడం ద్వారా కొత్త శకం ఆరంభమైందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
పేర్కొన్నారు.
కామన్వెల్త్ దేశాధినేతల సరసన ధన్‌ఖడ్ : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
భారతదేశ ప్రతినిధిగా హాజరై కామన్వెల్త్ దేశాధినేతల సరసన ఆశీనులయ్యారు. ఆయన
భార్య డాక్టర్ సుదీప్ కూడా పాల్గొన్నారు. వేడుకను ప్రత్యక్షంగా
తిలకించడానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. పెద్దఎత్తున రాజకుటుంబ
అభిమానులు తెల్లవారుజాము నుంచే బకింగ్‌హాం ప్యాలెస్‌కు చేరుకున్నారు.
ఇక రాణి కెమిల్లా : ఇంతవరకు ఛార్లెస్-3 భార్యగా ఉన్న కెమిల్లాకు అధికారికంగా
రాణి హోదా లభించింది. ప్రధాన ఘట్టం ముగిసిన కాసేపట్లోనే ఆమెను కొత్త హోదాతో
సంబోధిస్తూ బకింగ్‌హ్యాం ప్యాలెస్ ట్వీట్ చేసింది. ఛార్లెస్-3, కెమిల్లాలకు
2005లో వివాహమైంది.
ప్రత్యేక నాణేలు : ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి వెండి రంగులో ముద్రించిన
వంద 50 పెన్స్ నాణేలను సిద్ధం చేశారు. వీటిపై రాజు ముఖచిత్రం ఉంది. వీటి
విలువ 50 పౌండ్లు. ప్రతినిధుల సభ నేత పెన్నీ మోర్డాంట్ ఈ నాణేల మూటను
తీసుకువెళ్లి ఖడ్గాన్ని స్వీకరించారు. ఇలా తీసుకున్న తొలి మహిళగా రికార్డు
సృష్టించారు. రాజు, రాణి, బ్రిటన్ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దాతృత్వ సంస్థల
ప్రతినిధులు, బ్రిటన్ మాజీ ప్రధానులు, నోబెల్ పురస్కార విజేతలు, సినీ
ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. పట్టాభిషిక్తుడైన బ్రిటన్ రాజు ఛార్లెస్‌కు
భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.