త్వరలో రూ.14 వరకు ధర పెంపు
ఇస్లామాబాద్ : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్లో ప్రజలకు
మరిన్ని ఇక్కట్లు ఎదురు కానున్నాయి. వచ్చే 15 రోజుల్లో ప్రభుత్వం పెట్రోల్
ధరను రూ.10నుంచి రూ.14వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ఓ
మీడియా సంస్థ కథనం వెలువరించింది. అదుపుతప్పిన ద్రవ్యోల్బణానికి తోడు ప్రపంచ
విపణిలో చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టనున్నట్లు
అందులో పేర్కొంది. ప్రస్తుతం పాక్లో పెట్రోల్ ధర లీటరు రూ.272 ఉండగా, ఇది
రూ.286.77కు చేరే అవకాశాలున్నాయి.