సూడాన్ : ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో మరోసారి పరిస్థితి అదుపుతప్పింది.
సూడాన్‌లో ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ
క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ
నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సూడన్‌లో ఉన్న భారతీయులను ఇండియన్
ఎంబసీ హెచ్చరించింది. వారు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ వేదికగా
పేర్కొంది. వివరాల ప్రకారం.. సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్
ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ
విషయమై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్
హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో
శనివారం.. విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
దీంతో, సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ
బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.