పాక్, అఫ్గాన్ సరిహద్దులో సంభవించిన భూకంపం ప్రభావం భారత్‌తో సహా పలు
దేశాల్లో కనిపించింది. ఉత్తర భారత ప్రజలు భయంతో వణికిపోయారు. ఇప్పటికే ఆర్థిక,
ఆహార సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్ అప్గానిస్థాన్‌ను భూకంపం
వణికించింది. దీని ప్రభావం భారత్‌లోనూ కనిపించింది. ఈ విపత్తు కారణంగా తమ
దేశంలో దాదాపు 9 మంది మరణించారని, వంద మందికి పైగా గాయపడ్డారని పాక్
అధికారులు వెల్లడించారు. ఇక అఫ్గాన్‌లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. రిక్టర్
స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5 గా నమోదైంది. దీంతో భారత్‌లోని పలు రాష్ట్రాల్లో
భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్,
పంజాబ్, హరియాణా, రాజస్థాన్లలోని కొన్నిచోట్ల ప్రకంపనలు వచ్చాయి. దాంతో
ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దేశరాజధాని ఢిల్లీ
లోని పలు ప్రదేశాల్లో భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రకంపనల కారణంగా నోయిడాలో పలు
ఇళ్లలో సామగ్రి కింద పడింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్,
పెషావర్ రావల్పిండిలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
తుర్కెమెనిస్థాన్, కజఖ్‌స్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా,
కిర్గిస్థాన్‌లో కూడా ఈ ప్రకంపనల ఎఫెక్ట్ కనిపించింది.