ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్‌లో విధ్వంసకాండపై తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్
అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు డజన్‌కుపైగా పీటీఐ
నేతలపై ఉగ్రవాదం కేసు నమోదైంది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో
పీటీఐ శ్రేణుల విధ్వంసం, భద్రతాదళాలపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదు
చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్ పార్టీపై నిషేధం విషయంలో
న్యాయ నిపుణులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు పాక్ మంత్రి రాణా సనావుల్లా
తెలిపారు. తోషఖానా కేసులో విచారణకుగానూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్
ఖాన్ ఇస్లామాబాద్‌కు చేరుకున్న వేళ ఘర్షణ వాతారవణం తలెత్తింది. కోర్టు
ప్రాంగణం వెలుపల ఆయన మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్(PTI)
పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో 25 మంది పోలీసు సిబ్బంది
గాయపడ్డారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసం, భద్రతా సిబ్బందిపై
దాడి, అలజడి సృష్టించడం వంటి చర్యలకు కారణమైనందుకుగానూ ఇమ్రాన్‌తోపాటు డజనుకు
పైగా పీటీఐ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. దీంతో ఇమ్రాన్ పై
ఇప్పటివరకు దాఖలైన కేసుల సంఖ్య 97కు పెరిగింది.