తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్ ఆరోపించారు. మంగళవారం తనను అరెస్ట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో
పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారని,
మద్దతుదారులంతా తన కోసం ఆందోళనకు దిగాలని పిలుపునిచ్చారు. కొందరు మహిళలతో
లైంగిక సంబంధాలు పెట్టుకున్న ట్రంప్.. వారికి డబ్బులు ఇచ్చి నోరు మూయించారన్న
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఈ కేసును
విచారిస్తోంది. అయితే, ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రాసిక్యూటర్ల నుంచి
అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని ట్రంప్ న్యాయవాది పేర్కొనడం గమనార్హం. మాజీ
అధ్యక్షుడు మాత్రం సోషల్ మీడియాలో తన అరెస్టుపై పోస్టులు చేశారు. మంగళవారం
(మార్చి 21న) తనను కస్టడీలోకి తీసుకుంటారని తేదీ సైతం చెప్పారు.