హాంకాంగ్ : కొవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్న చైనా సుదీర్ఘ విరామం అనంతరం
తొలిసారి తన సరిహద్దులను తెరవనుంది. విదేశీ పర్యాటకులను మునుపటిలా దేశంలోకి
అనుమతించనుంది. బుధవారం నుంచి అన్ని రకాల వీసాలనూ జారీ చేయనుంది. కరోనా
కారణంగా దాదాపు మూడేళ్ల పాటు చైనా తన సరిహద్దులను మూసేసింది. కొవిడ్‌పై విజయం
సాధించామని ఇటీవల ఆ దేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులను బుధవారం నుంచి
అనుమతిస్తామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. హాంకాంగ్, మకావు, హైనన్
ఐల్యాండ్లకు వీసాలు అవసరం లేకుండానే పర్యాటకులను గతంలో మాదిరిగా
అనుమతించనున్నారు. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు
చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.