బీజింగ్ : దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు సైన్యాన్ని మహా ఉక్కు కుడ్యం(గ్రేట్
వాల్ ఆఫ్ స్టీల్)గా తీర్చుదిద్దుతానని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
ప్రతినబూనారు. దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు సైన్యాన్ని మహా ఉక్కు
కుడ్యం(గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్)గా తీర్చుదిద్దుతానని చైనా అధ్యక్షుడు షీ
జిన్పింగ్ ప్రతినబూనారు. ప్రపంచ రాజకీయాల్లో డ్రాగన్ అత్యంత కీలక పాత్ర
వహించబోతుందనీ తెలిపారు. చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్
కాంగ్రెస్(ఎన్పీసీ) సమావేశాల ముగింపు సందర్భంగా సభ్యులనుద్దేశించి
జిన్పింగ్ ప్రసంగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని మరింత
బలోపేతం చేసేలా మద్దతివ్వాలని ఆయన కోరారు. ప్రపంచ అభివృద్ధి, భద్రత విషయాల్లో
చైనా కీలకమైన, చురుకైన పాత్ర పోషించేలా చొరవ తీసుకుంటుందని తెలిపారు. దేశ
సైనిక బలగాలను ఆధునికీకరించి అత్యంత బలోపేతం చేసి మహా ఉక్కు కుడ్యంగా
మారుస్తామన్నారు. అభివృద్ధికి భద్రత పునాది వంటిది. దేశం అన్ని రంగాల్లో
పురోగమించాలంటే సుస్థిరత అవసరమని జిన్పింగ్ పేర్కొన్నారు.