మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత పర్యటనకు
రానున్నారా? అంటే ఆ అవకాశాలున్నాయని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత పర్యటనకు రానున్నారా? అంటే ఆ
అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ లో సెప్టెంబరులో జరిగే జీ-20 సదస్సుకు
పుతిన్ హాజరవుతారా? అని అడిగిన ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి
దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ‘‘దాన్ని కొట్టిపారేయలేం. జీ-20 సమావేశాల్లో
రష్యా పూర్తిస్థాయిలో హాజరవుతూనే ఉంది. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుంది.
అయితే పుతిన్ పాల్గొనడంపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని
వెల్లడించారు. దీంతో పుతిన్ భారత్కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ
ఏడాది జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే
సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది.