బీజింగ్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి
తెలిసిందే. ఈ మేరకు జిన్‌పింగ్ శుక్రవారం అధ్యక్షుడిగా బాధ్యతలు
స్వీకరించారు. గతేడాది అక్టోబరు16న జరిగిన 20వ కమ్యూనిస్ట్ పార్టీ
కాంగ్రెస్‌లో ఆయన్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
జిన్‌పింగ్ మరో ఐదేళ్లపాటు డ్రాగన్ కంట్రీకి అధ్యక్షుడిగా కొనసాగుతారు.
కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్‌గా, చైనా అధ్యక్షుడిగా తన పదేళ్ల పదవి కాలం నేటితో
పూర్తి చేసుకున్నారు జిన్‌పింగ్. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత
మూడవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు కూడా జిన్‌పింగ్‌నే కావడం
విశేషం. అలాగే జిన్‌పింగ్ సన్నిహితుడు లీ కియాంగ్‌ను కొత్త
ప్రీమియర్‌గా(ప్రధానిగా) నియమించేందుకు రంగం కూడా సిద్దం అయ్యింది. ఈ 69 ఏళ్ల
కొత్త ప్రీమియర్ లీ గతేడాది జీరో కోవిడ్ విధానం తోసహా పలు సవాళ్లను
ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఈ మేరకు ‘ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ది
వరల్డ్’అనే శీర్షికతో జిన్‌పింగ్ బయోగ్రఫీని రాస్తున్న సహ రచయిత గీజేసి
మాట్లాడుతూ చైనాపైనే జిన్‌పింగ్ దృష్టి ఉంటుందని, ఆయన దీన్ని ప్రపంచంలోనే
అత్యంత శక్తిమంతమైన దేశంగా చూడాలనుకుటున్నాడని అన్నారు. కాగా జిన్‌పింగ్
అంతగా పేరులోని ఓ కమ్యునిస్ట్ పార్టీ నుంచి ప్రపంచ శక్తిమంతమైన నాయకుడిగా
ఎదిగారు. 1980 తర్వాత పార్టీలో కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు. ఎవరూ కూడా
పదేళ్లకు మించి అధికారంలో ఉండకూడదన్న రూల్ తెచ్చారు. కానీ జిన్‌పింగ్ కోసం ఆ
నిబంధనలను పక్కనబెట్టింది కమ్యూనిస్టు పార్టీ.